-

Israel-Hamas War: గాజాలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

27 Nov, 2023 05:09 IST|Sakshi

జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్‌ ప్రయతి్నస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం అక్కడ అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు.

ఇజ్రాయెల్‌ బయట పెట్టిన హమాస్‌ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ‘‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్‌ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను ‘సరిచేయడం’’ అని అన్నారు. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఉత్తర గాజాలో పర్యటించారు.

మరిన్ని వార్తలు