పట్టు సాధిస్తున్న ఇజ్రాయెల్‌

10 Oct, 2023 05:52 IST|Sakshi

జెరూసలేం: హమాస్‌ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్‌ గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటిదాకా 800 పైచిలుకు ప్రాంతాలను నేలమట్టం చేసినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఇజ్రాయెలీ ప్రాంతాలను మిలిటెంట్ల చెర నుంచి సోమవారం విడిపించింది. అయితే దక్షిణాదిన పలుచోట్ల ఇంకా మిలిటెంట్లతో ఇజ్రాయెల్‌ సైన్యం హోరాహోరీ పోరాడుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో పదుల కొద్దీ అదనపు దళాలను ఇజ్రాయెల్‌ రంగంలోకి దించుతోంది. ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతు అందించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల నేపథ్యంలో ఆ దేశ విమాన వాహక యుద్ధ నౌకలు తదితరాలు తూర్పు మధ్యదరా సముద్రం వైపు తరలాయి. సమీప ప్రాంతాల యుద్ధ విమాన దళాలను కూడా అమెరికా హుటాహుటిన సమీకరిస్తోంది.

దాడి వెనక ఇరాన్‌!
ఇజ్రాయెల్‌పై దాడి వెనక ఇరాన్‌ హస్తం, ప్లానింగ్‌ ఉన్నట్టు హమాస్, హెజ్బొల్లా నేతలే స్వయంగా వెల్లడించారు. గాజా స్ట్రిప్‌లో 30 మందికి పైగా ఇజ్రాయెలీలను తాము బందీలుగా పట్టుకున్నట్టు ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ చీఫ్‌ జైద్‌ అల్‌ నఖాలా చెప్పాడు. 

మరిన్ని వార్తలు