డిబేట్‌ తర్వాత పెరిగిన బైడెన్‌ ఆధిక్యం!

6 Oct, 2020 02:32 IST|Sakshi

వాషింగ్టన్‌: తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి జోబైడెన్‌ పాపులారిటీ 14 పర్సంటేజ్‌ పాయింట్ల మేర పెరిగిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సర్వే తెలిపింది. అధ్యక్ష రేసులోకి దిగిన తర్వాత బైడెన్‌కు ఇంత ఆధిపత్యం రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సర్వేలో బైడెన్‌కు 53 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌నకు 39 శాతం మద్దతు దక్కింది. సెప్టెంబర్‌ 20 సర్వేతో పోలిస్తే బైడెన్‌కు 6 పాయింట్ల ఆధిపత్యం పెరిగింది. ట్రంప్‌నకు కరోనా నిర్థారణ ప్రకటనకు ముందు ఈ సర్వే నిర్వహించారు.  డిబేట్‌లో బైడెన్‌ అదరగొట్టాడని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24 శాతం మంది ట్రంప్‌దే హవా అని పేర్కొనగా 17 శాతం మంది ఇద్దరిలో ఎవరూ ఆధిపత్యం ప్రదర్శించలేదని అన్నారు. ఓటింగ్‌లో తమపై డిబేట్‌ ప్రభావం ఉండదని సర్వేలో 73 శాతం మంది చెప్పారు. ఎప్పటిలాగే ట్రంప్‌ ప్రత్యర్ధిని బెదిరించారని ఎక్కువమంది భావించారు.

మరిన్ని వార్తలు