వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400

17 Jun, 2021 20:50 IST|Sakshi

పోంగ్యాంగ్‌: నేను మోనార్క్‌ని ఎవరి మాట వినే ప్రసక్తే లేదంటూ ప్రవర్తించే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం కోసం అని కాకుండా తన కోసం అన్నట్లుగా అతని పరిపాలన చేస్తుంటాడు. ప్రపంచీకరణ తర్వాత ప్రతీ దేశం మరొక దేశం పై ఆధారపడడం సర్వ సాధారణంగా మారింది. కానీ కిమ్‌ మాత్రం తన చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరు దేశాలను పక్కన పెడుతుంటాడు. ఇప్పుడు ఈ తీరు కారణంగానే ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కోంటోంది.

గత కొంత కాలంగా కరోనా ఆంక్షలు అమలు చేస్తుండడంతో ఆ దేశంలోని ఆహార నిల్వలు అడుగంటి పోయాయి. ఆహార పదార్థాలు సరిపడక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కిలో అరటి పండ్లు 45 డాలర్లు పలుకుతోంది. అనగా మన భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ.3400. కాగా ఇది వరకు ఆహారం , చమురు, ఎరువులు, వంటివి వాటి కోసం చైనా పైనే ఎక్కువగా ఉత్తర కొరియా ఆధారపడుతుంది. చైనాతో సరిహద్దులు మూసేయడంతో ఆ దేశం నుంచి దిగుమతి తగ్గిపోయింది. దీంతో ఆహార కొరత ఏర్పడి అక్కడి ప్రజలు దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరో పక్క నిషేధిత అణు పరీక్షల జరుపుతున్న కారణంగా ఉత్తర కొరియా ఇప్పటికే పలు రకాల అంతర్జాతీయ ఆంక్షలను కూడా ఎదుర్కొంటోంది. 

చదవండి: ఆఫ్రికాలో దొరకిన ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం

మరిన్ని వార్తలు