Breast Milk Jewellery: తల్లి పాలతో అలా.. ఏడాది సంపాదన ఏకంగా 15 కోట్ల రూపాయలు!!

26 Mar, 2022 15:45 IST|Sakshi

తల్లి పాలతో ఆభరాల తయారీ.. వినడానికి వింతగా, ఒకింత ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. కానీ, ఇందులో ఎలాంటి తప్పు లేదని అంటోది లండన్‌కు చెందిన ఓ జంట. పైగా ఈ ఆభరణాల్లో ఎమోషనల్‌ కనెక్టివిటీ కూడా ఎంతో ఉందని చెప్తున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన సఫియ్యా రియాద్‌, ఆమె భర్త అడమ్‌ రియాద్‌లు ఈ వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నారు. అది ఎలాగో వాళ్ల మాటల్లోనే.. 

‘మాది బెక్సెలె(లండన్‌).  నేను, నా భర్త ఆడమ్‌ రియాద్‌ ‘మాగ్నెట ఫ్లవర్స్‌’ 2019లో ఓ ఒక కంపెనీని నెలకొల్పాం. ఈవెంట్లకు పూల సరఫరా చేస్తూ.. ఈవెంట్‌ అయిపోగానే ఆ పూలనే కస్టమర్లకు మధురైన జ్ఞాపకార్థాలుగా మార్చేసి ఇస్తాం. ఆ సమయంలో నాలుగు వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. అయితే ఆ మరుసటి ఏడాదే కరోనా వచ్చి పడింది. కరోనా టైంలో వ్యాపారం అరకోరగా సాగింది. ఒకరోజూ నేనూ నా భర్త.. తల్లి పాలతో ఆభరణాల తయారీ ఆర్టికల్‌ చదివాం. ఆ ఐడియా ఆసక్తికరంగా అనిపించింది. 

వెంటనే మెజంటా ఫ్లవర్‌ నుంచే ఈ ఐడియాను అమలు చేస్తున్నాం. భద్రపరిచిన పాలను.. విలువైన రాళ్లుగా మార్చడమే ఆభరణాల తయారీలో కీలకం. ఇందుకోసం చాలా స్టడీస్‌ చేశాం. ఈ పద్ధతిలో.. ముందుగా పాలను డీహైడ్రేట్‌ చేస్తారు. ఆపై హైక్వాలిటీ నాన్‌ ఎల్లోయిం‍గ్‌ రెసిన్‌ను మిక్స్‌ చేస్తారు. ఆపై ఆ గట్టి రాయిని.. నెక్లెస్‌, చేతి రింగులు, చెవి పోగులుగా అద్దుతారు. పైన చేసిన కెమికల్‌ రియాక్షన్‌ వల్ల తల్లిపాలతో చేసిన ఆ రాయి చాలాకాలం మన్నుతుంది కూడా.   

ఇదేం వ్యాపారం చెండాలంగా.. అని విమర్శించే వాళ్లకు ఆమె సమాధానం కూడా అంతే గట్టి సమాధానం ఇస్తోంది. ‘‘తల్లి పాల ఆభరణాలతో సెంటిమెంట్‌ కనెక్టివిటీ ఉంటుంది. సిగ్గు పడేంత తప్పు కాదు.. అది అమ్మల కోసమే!. వాళ్ల జీవితాల్లో ఏదైనా సందర్భాల్లో వీటిని పంచుకోవచ్చు కూడా. ప్రస్తుతం ఇది హాట్‌ బిజినెస్‌గా మారింది. పైగా వీటి తయారీ కోసం కస్టమర్ల(ఆ తల్లుల) దగ్గరి నుంచే 30 మిల్లీలీటర్ల పాలను సేకరిస్తున్నాం. ఎందుకంటే అది వాళ్ల జ్ఞాపకాలకు సంబంధించింది కదా. అంటోంది సఫియ్యా రియాద్‌. దీనికి తోడు మతపరంగా వస్తున్న విమర్శలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు.  

ప్రస్తుతం ఈ భార్యాభర్తలు.. తల్లి పాల ఆభరణాలతో కోట్లు సంపాదిస్తున్నారు. 2023 ఏడాది కోసం 1.5 మిలియన్‌ పౌండ్ల(మన కరెన్సీలో దాదాపు రూ.15 కోట్ల) మేర టర్నోవర్‌ సాధిస్తున్నట్లు ప్రకటించుకుంది ఈ జంట.

మరిన్ని వార్తలు