లక్కీ డ్రా.. రాత్రికి రాత్రే రూ.7.45 కోట్లు జాక్‌పాట్‌

16 Jul, 2021 13:31 IST|Sakshi

దుబాయ్‌: లక్కీడ్రాలు కొంతమందికి కలిసివస్తాయి. ఒక లాటరీ టికెట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులనైన వార్తలను మనం ఇప్పటికే చాలా చూసి ఉంటాం. తాజాగా  భారత్‌కు చెందిన ప్రైవేట్‌ నౌకలో​ ఉద్యోగిగా పనిచేస్తున్న గణేష్‌ షిండేకు కూడా ఇలాంటి అదృష్టమే వరిచింది. వివరాలు.. మహారాష్ట్రలోని థానేకు చెందిన 36 ఏళ్ల గణేశ్‌  బ్రెజిల్‌కు చెందిన ఒక ప్రైవేటు నౌకసంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా అతడు దుబాయ్, రియో డీ జనెయిరోల మధ్య రాకపోకలు సాగించేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా గణేష్ దుబాయ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. కాగా గత జూన్‌ 16న దుబాయ్‌లో మిలీనియం మిలియనీర్‌ అండ్‌ ఫైనస్ట్‌ సర్‌ప్రైజ్‌ నుంచి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. తాజాగా గురువారం లాటరీ టికెట్లను విడుదల చేయగా గణేష్‌కు జాక్‌పాట్‌ తగిలింది. 1 మిలియన్‌ యునైటెడ్‌ స్టేట్స​ డాలర్స్‌( ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ.7.45 కోట్లు) దక్కించుకున్నాడు.

ఇదే విషయమై గణేష్‌ స్పందించాడు.'' నాకు  లాటరీ తగలిందనే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నా. లాటరీలో వచ్చిన డబ్బుతో  కొత్త కారు, కొత్త ప్లాటు కొంటాను. పిల్లల చదువు కోసం కొంత డబ్బులు దాచుకుంటాను.ఇది చాలా గొప్ప అవకాశం. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దుబాయ్ నగరాన్ని ప్రేమిస్తున్నాను. త్వరలోనే దుబాయ్‌ను సందర్శించాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా కోరికలున్నాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు