Massive Earthquake Hits Iran: భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన ఇరాన్.. యూఏఈలోనూ ప్రకంపనలు

2 Jul, 2022 07:33 IST|Sakshi

టెహ్రాన్‌: భారీ భూకంపంతో ఇరాన్‌ చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవాం అర్ధరాత్రి నుంచి శనివారం తిరిగి తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో పలుమార్లు భూమి కంపించింది. హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.

అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ ఝామున వరకు చాలాసార్లు  ప్రకంపనలు సంభవించాయి ఈ ప్రాంతంలో.  రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 4.6, 4.4, ఆపై 6.0, 6.3గా నమోదు అయ్యింది. ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. 

టెక్టోనిక్ ప్లేట్ల అంచున వివిధ ఫాల్ట్ లైన్‌లను దాటుతున్న ఇరాన్.. బలమైన భూకంపాలకు నెలవుగా మారింది. తాజా భూకంప తీవ్రత 10కిలోమీటర్ల ప్రభావం చూపెట్టింది. ఇక 1990లో రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఉత్తర ఇరాన్ ప్రాంతంలో 40,000 మందిని పొట్టనబెట్టుకుంది.

యూఏఈలోనూ ప్రకంపనలు
యూఏఈలో, ఏడు ఎమిరేట్స్‌లోనూ స్వల్పప్రకంపనలు సంభవించాయని యూఏఈ నేషనల్‌ సెంటర్ ఆఫ్‌ మెటియోరాలజీ తెలిపింది. అయితే ప్రభావం ఎలాంటి నష్టం చూపించలేదని యూఏఈ తెలిపింది.  


షార్జాలో ప్రకంపనలతో రోడ్ల మీదకు చేరిన జనం

మరిన్ని వార్తలు