ఉన్నట్టుండి పేలిన ఫోన్‌, షాకైన జనం: వైరల్‌ వీడియో

21 Apr, 2021 18:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా  చార్జింగ్‌లో ఉండగా  స్మార్ట్‌ఫోన్లు పేలిపోయిన ఘటనలను  గతంలో అనేకం చూశాం.  కొన్నిసార్లు  విమానంలో  బ్యాగులో ఉండగా  పేలిపోయిన సందర్భాలూ ఉన్నాయి.  కానీ చార్జింగ్‌లో లేకుండానే.. ఒక వ్యక్తి బ్యాగులో  ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఉన్నట్టుండి పేలిపోవడం ఎపుడైనా చూశారా. లేదు కదా.. అయితే చైనాలో ఇలాంటి  షాకింగ్ ఘటన ఒకటి  ఇటీవల చోటు చేసుకుంది.  దీంతో చుట్టుపక్కల ఉన్న జనం  షాక్‌ అయ్యారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేసింది. ఒక యువకుడు  పక్కన మరో అమ్మాకియితో కలిసి రద్దీగా ఉన్న రోడ్డుపై నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా తన బ్యాగులోంచి పెద్ద శబ్దంతో మంటలొచ్చాయి.దీంతో హతాశుడైన అతను ఆ బ్యాగ్‌ను విసిరేసి అక్కడ నుంచి తప్పుకున్నాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినా, యువకుడి చేయి, జుట్టు, కనురెప్పలు  స్వల్పంగా కాలాయని మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఆ వీడియో క్లిప్ లో బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం అది 2016లో కొన్న శాంసంగ్ ఫోన్. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు