ఒబామా కుటుంబంలో విషాదం

29 Mar, 2021 16:01 IST|Sakshi

నైరోబీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నాన్నమ్మ(వరసకు) సారా ఒబామా సోమవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె కెన్యాలో తన 99 ఏట మరణించారు. నాన్నమ్మ మరణంపై ఒబామా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘ ఇది నిజం.. ఆమె దేవుడి దగ్గరకు వెళ్లింది. ఈ ఉదయం ఆమె చనిపోయింది’’ అని ఆమె కూతురు మర్శత్‌ ఓన్‌యాంగో భావోద్వేగానికి గురయ్యారు. సారా ఒబామా 1922లో లేక్‌ విక్టోరియాలో జన్మించారు. బరాక్‌ ఒబామా తాత గారు హుస్సేన్‌ ఓన్‌యాంగో ఒబామా మూడో భార్య ఈ సారా ఒబామా. సారా ఒబామా ఫౌండేషన్‌ పేరిట ఆమె అనాథ పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు.

రక్త సంబంధం లేకపోయినప్పటికి  ఒబామా ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. 2006లో కెన్యా వెళ్లిన ఆయన సారా ఇంటికి వెళ్లారు. ఆమెను తన బామ్మ అంటూ అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాతే ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కాగా, మంగళవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు