ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అమెరికా ఓకే

12 Dec, 2020 05:29 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫారసు చేసింది. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి ఇవ్వాల్సిన అనుమతులపై ఎనిమిది గంటల సేపు చర్చించిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్స్‌ (ఎఫ్‌డీఏ), వ్యాక్సిన్స్‌ అండ్‌ రిలేటెడ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అడ్వయిజరీ కమిటీ (వీఆర్‌బీపీఏసీ) 17–4 ఓట్లతో వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలపై ఆందోళనలున్న నేపథ్యంలో అత్యవసర వినియోగానికి అనుమతుల్లో జాప్యం జరుగుతుందన్న ప్రచారానికి ఎఫ్‌డీఏ తెర దించింది. లాంఛనంగా ఎఫ్‌డీఏ ఆమోదం పొందాక వచ్చే వారం నుంచి అమెరికాలో భారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు