స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. టీకా వేసుకుంటారా లేక జైలుకు వెళ్తారా?

22 Jun, 2021 20:29 IST|Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే మరోసారి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోని వారిని జైలులో పెడతామని వార్నింగ్‌ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటారా? లేక జైలుకు వెళ్తారా? అని బెదిరించారు. కాగా, ఫిలిప్పీన్స్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయ తాండవం చేస్తోంది.

దేశంలో ఇప్పటివర​కు 13 లక్షల పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 23 వేల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ కొంతమంది వ్యాక్సిన్‌ పట్ల విముఖత చూపిస్తున్నారు. దాంతో టీకా వేసుకోవడానికి నిరాకరించిన  ప్రజలపై  రోడ్రిగో డ్యూటెర్టే విరుచుకుపడ్డారు. టీకా వద్దంటే ఖబర్దార్‌.. జైలులో ఊచలు లెక్కించాల్సిందే అని వ్యాఖ్యానించారు.

‘దేశంలో కరోనా సంక్షోభం ఉంది కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది, నన్ను తప్పుగా  భావించవద్దు’ అని డ్యూటెర్టే వివరణ ఇచ్చుకున్నారు. జూన్ 20 నాటికి, ఫిలిప్పీన్స్ అధికారులు 2.1 మిలియన్ల మందికి పూర్తిగా టీకాలు వేశారని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.

చదవండి: సిజేరియన్‌ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు

మరిన్ని వార్తలు