ఉక్రెయిన్‌పై రష్యా అతి పెద్ద  డ్రోన్‌ ఎటాక్‌, ఏకంగా 75 డ్రోన్లతో

25 Nov, 2023 19:34 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది.  సుమారు 75 ఇరానియన్ షాహెద్ డ్రోన్‌లతో అతిపెద్ద  దాడికి దిగింది. ఉక్రెయిన్‌ రాజధానిని లక్ష్యంగా   2022లో   రష్యా దాడి తరువాత శనివారం ఉదయం ఉక్రెయిన్‌పై అత్యంత తీవ్రమైన డ్రోన్‌ దాడికి దిగిందని సైనిక అధికారులు తెలిపారు. 71 డ్రోన్లు ఎయిర్ డిఫెన్స్ అడ్డగించిందని, వాటిని  ధ్వంసచేశాయని ఉక్రెయిన్ సాయుధ దళాలు  వెల్లడించాయి.

కైవ్‌పై డ్రోన్‌ల ద్వారా జరిగిన అత్యంత భారీ వైమానిక దాడి అని కైవ్ నగర పరిపాలన అధిపతి సెర్హి పాప్కో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమైఆరు గంటలకు పైగా కొనసాగింది.  77 నివాస భవనాలు  దెబ్బతిన్నాయి.   విద్యుత్‌ సరఫరాకుత  తీవ్ర అంతారాయం ఏర్పడింది.  కనీసం ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.  

కాగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ నవంబర్ 11న రెండు నెలల్లో మొదటిసారిగా క్షిపణి దాడులను ఎదుర్కొంది. కీవ్ ఆ రాత్రి ప్రాణ నష్టం నుండి తప్పించుకున్నప్పటికీ వారాంతంలో డ్రోన్ దాడులతో సహా కీవ్, దాని పరిసరాలపై దాడులు కొనసాగుతున్నాయి. రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించినప్పటి నుండి దాదాపు 560 మంది చిన్నారులు, 10వేల మంది పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇప్పటి‍కైనా యుద్ధాన్ని ఆపాలన్న డిమాండ్‌  ఊపందుకుంటున్న తరుణంలో తాజా దాడి మరింత ఆందోళన రేకత్తిస్తోంది. 


 

మరిన్ని వార్తలు