'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి

5 Mar, 2023 13:03 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా ఢిల్లీలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ ఉక్రెయిన్‌ యుద్ధం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు లావ్‌రోవ్‌ మాట్లాడుతూ.."రష్యా దురాక్రమణదారు కాదు. మా​కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించారు. మేము ఆ యుద్ధాన్ని ఆపేందుకే యత్నించాం. ఉక్రెనియన్‌ ప్రజలను ఉపయోగించి మాకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిలే చేశారు.

వాస్తవానికి రష్యా తనను తాను రక్షించుకునేందుకే యుద్ధం చేస్తోంది. పశ్చిమ దేశాలకు రెండు రకలుగా ప్రవర్తిస్తాయి. జీ20 సమావేశంలో ఉక్రెయిన్‌ గురించి లెనెత్తినప్పుడూ లిబియా, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, యుగోస్లేవియా తదితర దేశాల పరిస్థితి గురించి చర్చించరే. ఆర్థిక నిర్వహణ, సూక్ష్మ ఆర్థిక విధానాల కోసం ఏర్పడిన జీ20 సదస్సు  తన రక్షణ కోసం పోరాడుతున్న రష్యా గురించి ఎవ్వరూ మాట్లాడరు గానీ కేవలం ఉక్రెయిన్‌ మాత్రమే జీ20కి కనిపిస్తుంది. అలాగే అమెరికా చేస్తున్న రష్యా డబులస్టాండర్డ్‌ వ్యాఖ్యలు గురించి మాట్లాడుతూ..సెర్బియాపై ఎప్పుడూ దాడి జరిగిందో అమెరికాకు తెలియదు, కానీ ఆ సమయంలో అమెరికా సెనెటర్‌గా ఉన్న బైడెన్‌ దీ‍న్ని తానే ప్రోత్సహించానని గొప్పలు చెప్పుకుంటాడు.

అలాగే ఇరాన్‌ దేశం నాశనమైనప్పుడూ టోని బ్లెయిర్‌ అది పొరపాటుగా చెప్పుకున్నాడు. అమెరికా దేశం ముప్పు అని ప్రకటించగానే మిగతా దేశాలు వంత పాడతాయే గానీ ఇలాంటి వాటి గురించి ప్రశ్నించదు." అని అన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరపడమనేది నేరపూరిత నేరం అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ డిక్రీ పై సంతంకం చేసినప్పుడూ..యుద్ధాన్ని ముగించేందుకు ఎలా చర్చలు జరుగుతాయన్నారు. రష్యాను యుద్ధ రంగంలో ఓడించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, నాటో సెక్రటరీ జనరల్‌ జెనస​ర్‌ స్టోల్టెన్‌బర్గ్‌ బహిరంగంగా ప్రకటించారని లావ్‌రోవ్‌ అన్నారు. అంతేగాదు ఐరోపాలో దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దాడివల్ల ప్రభావితం కాలేదని, రష్యా చర్యలన్నింటికి పశ్చిమ దేశాలే కారణమని లావ్‌రోవ్‌ ఆరోపించారు.   

(చదవండి: ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్‌.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!)

మరిన్ని వార్తలు