తాలిబన్ల పైశాచికం.. వీడియో వైరల్‌

16 Jan, 2022 19:18 IST|Sakshi

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాగతాలు మరోసారి వైరల్ వీడియోలో బట్టబయలయ్యాయి. దేశంలోని పాక్టియా ప్రావిన్స్‌లో.. ఒక సంగీతకారుడి సంగీత పరికరాన్ని తాలిబానీ పురుషులు తగులబెట్టారు. దీనిని చూస్తూ ఒకవైపు సంగీతకారుడు ఏడుస్తుండగా, మరోవైపు తాలిబన్లు తుపాకులు ధరించి దీనిని చూస్తూ పైశాచిక ఆనందం పోందడం గమనించవచ్చు. ఈ వీడియోను అబ్దుల్‌ హక్‌ ఒమేరి అనే జర్నలిస్ట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబాన్లు తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి, దేశంలో అనేక మార్పులు వచ్చాయి. కార్లలో, వివాహా వేడుకల సమయంలో సంగీతం వినడాన్ని తాలిబాన్ చట్టవిరుద్ధం చేసింది. పురుషులు, స్త్రీలు వేర్వేరు వేదికలలో వివాహాలు జరుపుకోవాలని బలవంతం చేశారు.

చదవండి: (అఖిలేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు')

మరిన్ని వార్తలు