కాలిఫోర్నియాలో వరద బీభత్సం.. నగరాన్ని వీడాలని హెచ్చరిక

11 Jan, 2023 08:05 IST|Sakshi

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు ముంచెత్తాయి. కాలిఫోరి్నయా, లాస్‌ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. 

భారీ వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. హాలీవుడ్‌ సినీ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని అధికారులు వెల్లడించారు. బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఈ నగరాన్ని వెంటనే వీడాలని అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. కాలిఫోర్నియాలో  17 ప్రాంతాల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాలిఫోర్నియాలో పలు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం పెరిగింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు