ఆడ పాము కోసం మగ పాముల కుస్తీ..వీడియో వైరల్‌

6 Jan, 2021 16:31 IST|Sakshi

రెండు పాములు కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అవి చేస్తున్న విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ పాముల విన్యాసం నెటిజన్లను ఆకర్షిస్తోంది. రెండు మగ పాములు ఆడ పాముతో సంభోగం కోసం సుమారు గంట పాటు పోట్లాడుకున్నాయి ఆస్ట్రేలియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీ అధికారి తెలిపారు.

త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన త‌ర్వాతే.. ఆడ పామును క‌లిసేందుకు వీలుంటుంది. గంట పాటు పాములు ఫైట్ చేయ‌డం ఇది రెండోసారి అని సదరు అధికారి తెలిపారు. వ‌సంత రుతువులో ఆడ పామును క‌లిసేందుకు మ‌గ పాముల వేట కొన‌సాగుతోంద‌ని చెప్పారు. పాముల క‌ల‌యిక‌కు ఇది స‌రైన స‌మ‌యం కాబ‌ట్టి పోటీ ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. 

మరిన్ని వార్తలు