ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా? సస్పెన్స్‌..టెన్షన్‌

13 Sep, 2022 13:02 IST|Sakshi

Battlefield developments unclear, Russian and Ukrainian militaries: ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి యుద్ధంలో చాలా అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. తొలుత రష్యా ధాటికి ఉక్రెయిన్‌ సైన్యం నేలకొరిగిపోతుందేమో అన్నట్లు భయానకంగా విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్‌ గడ్డ ఎటూ చూసిన శవాల దిబ్బలతో హృదయవిదారకంగా మారిపోయింది. రష్యా బలగాలు మొదటగా కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా సాగిన దాడులు కాస్త విఫ్లలమయ్యాయి. దీంతో తూర్పు ఉక్రెయిన్‌ దిశగా బలగాలను మళ్లించి తీవ్రంగా విరుచుకుపడింది రష్యా.

ఉక్రెయిన్‌ వేర్పాటువాదుల ప్రాంతాల నుంచి దాడులు చేసే వ్యూహంతో సాగి క్రమంగా పుంజుకోవడం ప్రారంభంమైంది. వేలాది ఉక్రెయిన్‌ సైనికులు నేలకొరగడంతో బలగాల కొరత, ఆయుధాల కొరతను ఎదుర్కొంది ఉక్రెయిన్‌. తదనంతరం పాశ్చాత్యదేశాల సహకారంతో రష్యాతో అలుపెరగని పోరు సాగించింది. అంతేకాదు రష్యా బలగాలు భీకరమైన దాడులతో ఉక్రెయిన్‌ భూభాగంలో ఐదోవంతును నియంత్రించింది. ఐతే అనుహ్యంగా ఈ నెలలో ఉక్రెయిన్‌ బలగాలు పుంజుకుంటూ రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి దక్కించుకుంది. తూర్పు డోన్‌బాస్‌ని స్వాధీనం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు వ్యాదిమర్‌ పుతిన్‌ లక్ష్యాన్ని నిర్విర్వం చేసింది ఉక్రెయిన్‌ సైన్యం.

ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధం రెండోవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ చూసిన అతి పెద్ధ సాయుధ సంఘర్షణగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మేరకు యూఎస్‌ రక్షణ కార్యదర్శి లియోన్‌ పనెట్లా ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ...రష్యా ఒకవేళ ఓడుపోయే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం అత్యంత ప్రమాదకరమైన అణుదాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందన్న భయాందోళలను ఎక్కువ అవుతున్నాయని అన్నారు.

ఈ క్రమంలో లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌లో యుద్ధ అధ్యయనాల ఎమెరిటస్‌ ప్రొఫెసర్‌, సైనిక చరిత్రకారుడు లారెన్స్‌ ఫ్రీడ్‌మాన్‌ మాట్లాడుతూ...ఈ యుద్ధం ఊహించని వాటిని తారుమారు చేస్తుందని చెప్పారు. ఇక రానున్న శీతకాలం యుద్ధ ప్రతిష్టంభనకు గురిచేస్తుందన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ...రష్యా  పతనం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు. రష్యా సైనిక ఓటమిని చవిచూస్తుందన్నారు. అదీగాక దళాల ఆయుధాలకు కీలకమైన ప్రాంతం ఇజియంను రష్యా వదిలివేయడం అదర్నీ ఆశ్చర్యపరిచిందని వాషింగ్టన్‌ థింక్‌ ట్యాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌ తన నివేదికలో పేర్కొంది.

ఐతే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ దాని అసలు లక్ష్యాలను సాధించే వరకు దాడి కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరాఖండీగా చెప్పడం గమనార్హం. ఖార్కివ్‌ ఎదురు దాడిలో ఉక్రెయిన్‌ బలగాలు అనుహ్యంగా దాడులను తిప్పిడుతూ... మొహరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుందని రష్యన్‌ సైనిక నిపుణడు సీఎన్‌ఏ సెక్యూరిటీ థింక్‌ ట్యాంక్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఈ యుద్ధం రష్యన్‌ మిలటరీకి అనుకూలమైనది కాదని నర్మగర్భంగా చెప్పాడు. మానవశక్తి, సైనిక కొరత తదితర సమస్యలను రష్యా ఎదరుర్కొంటుందని తెలిపాడు. ఇటీవల రష్యా బలగాల తిరోగమనంతో రష్యా కూడా ఉక్రెయిన్‌ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ప్రజాభిప్రేయ సేకరణను నిలిపేసింది. మరోవైపు రష్యా ఈ దాడులను ఉపసంహరించుకోవాలనే రాజకీయ నిర్ణయం తీసుకోకపోతే తామే స్వయంగా వెళ్లి విజ‍్క్షప్తి చేస్తామని లండన్‌లోని ల్యాండ్‌ వార్‌ఫేర్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో జాక్‌ వాట్లిగ్‌ చెబుతుండటం గమనార్హం. 

ఇదీ చదవండి: చందమామే దిగి వచ్చిందా!


 

మరిన్ని వార్తలు