హెచ్1బీ వీసా : ట్రంప్‌కు మరో షాక్‌

2 Oct, 2020 10:30 IST|Sakshi

వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  భారీ షాక్ తగిలింది. హెచ్1బీ  వీసాలతో సహా వర్కింగ్‌ వీసాలపైవీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకుంది. ఈ ఏడాది జూన్‌లో అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై నిలువరిస్తూ ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో  హెచ్1 బీ  వీసా ఆంక్షలను తక్షణమే అడ్డుకుంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు తెలిపారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష)

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై   న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు.
ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అడ్డంకులు కల్పించారని వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్నవీసా పరిమితులపై ఈ తీర్పు   ఊరటనిస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు.  హెచ్‌1బీ, హెచ్‌ 4,  హెచ్ 2బీ, జే, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై  తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా