కోవిడ్‌ పుట్టుకపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆంటోనీ ఫౌసీ

24 May, 2021 19:29 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించి అమెరికాలోని ప్ర‌ముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఆంటోని ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు క‌రోనా వైర‌స్ స‌హ‌జంగా అభివృద్ధి చెందింది అనే వాద‌న‌తో తాను ఏకీభ‌వించ‌న‌ని పేర్కొన్నారు. యునైటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అమెరికా పేరిట ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. కోవిడ్‌ వ్యాప్తికి దారి తీసిన ప‌రిస్థితులు, అలాగే చైనాలో వైరస్‌కు సంబంధించి అసలు ఏం జ‌రిగింద‌నే దానిపై నిజాలు వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ ప‌రిశోధ‌న‌లు జరపాలని అన్నారు.

జంతువుల నుంచి మనుషులకు ఈ వైర‌స్ సోకింద‌ని ప‌రిశోధ‌కులు చెప్తున్నప్పటికీ వైరస్‌ పుట్టుక, వ్యాప్తికి ఇంకేదో కారణాలు ఉండ‌వ‌చ్చ‌ని ఆయన అన్నారు. మనం దాన్ని మ‌నం క‌నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని పౌసీ అన్నారు. చైనాలో ఏం జ‌రిగిందనేది గుర్తించేందుకు త‌దుప‌రి ప‌రిశోధ‌న‌ల ప‌ట్ల తాను పూర్తి సానుకూలంగా ఉన్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కాగా గత సంవత్సరం డాక్టర్ ఫౌసీ ప్రపంచవ్యాప్తంగా 165 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి సోకి, 3.5 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారని వార్తపై సానుకూలంగా స్పందించలేదు. ఈ వైరస్‌ జన్యుపరంగా తయారు చేసిందని చైనాలోని వుహాన్‌ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిందనే వాదనను కూడా అ‍ప్పట్లో తోసిపుచ్చారు. ప్ర‌స్తుతం యూట‌ర్న్ తీసుకోవ‌డం విశేషం. ఫాక్స్ న్యూస్ ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ పరిపాలన అధికారులు, రిపబ్లికన్లు చైనాలో ల్యాబ్ లీక్ ఫలితంగా కోవిడ్ -19 అధిక అవకాశం ఉందని చాలాకాలంగా వాదించారు.

చదవండి: కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు