శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్‌

13 Sep, 2022 17:05 IST|Sakshi

సముద్రం ఎన్నో రకాల జీవుల సముదాయం. సమద్రం చీకటి లోతుల్లో నమ్మశక్యంకానీ జీవులను ఎన్నింటినో పరిచయం చేసింది. అలానే ఇప్పుడూ మరో మిస్టీరియస్‌ జీవిని మనకు పరిచయం చేస్తోందా అన్నట్లు ఉంది ఆ జీవి. ఆ జీవిన చూసి సముద్ర శాస్తవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ జీవి చూసేందుకు జీవిలా కాకుండా నీటి కుంటలా ఉంటుంది. ఈ జీవి అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది.

నేషనల్‌ ఓషియానిక్‌ అండ​ అట్మాస్సియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ) ఓషన్ ఎక్స్‌ప్లోరర్ సిబ్బంది అట్లాంటిక్‌లో చేసిన యాత్రలో ఇది కనిపించింది. ఇది మృదువైన పగడపు స్పాంజ్‌ లేదా ట్యూనికేట్‌ కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది డెనిమ్‌ బ్లూ కలర్‌లో ఉంటుంది. కానీ ఇది ఇంకా ఒక అంతు చిక్కని జీవిగా మిస్టరీగానే ఉంది. ఆ విచిత్ర జీవికి సంబంధించిన వీడియోని ఎన్‌ఓఏఏ  ఓషన్ ఎక్స్‌ప్లోరర్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఈ జీవిన 'బ్లూ గూ'[ జీవిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

(చదవండి: జిన్‌పింగ్‌ పుతిన్‌, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !)

మరిన్ని వార్తలు