ఎలుక పిల్లలను నంజుకుతిన్న రెండు తలల పాము.. వీడియో వైరల్‌

24 Jul, 2021 17:25 IST|Sakshi

పాములు ఏ రకం అయినా కావొచ్చు. ఏ జాతికి చెందినదైనా ఉండొచ్చు. దానిపై మనుషులకు ఉండేది ఒకే ఫీలింగ్‌. అదే భయం. పామంటే ఉండే వణుకు మనల్ని ఎన్నటికీ వీడదు. పాముల్లో రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా రెండు తలల పాముకు చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలీయరాలేదు కానీ..రెండు తలలు కలిగిన ఓ పాము రెండు ఎలుక పిల్లలను పట్టుకొని ఒక్కో నోటితో ఒక్కో దాన్ని ఎంచక్కా లాగించేసింది.

దీనికి సంబంధించిన వీడియోను జంతువుల సాహసం కోసం ప్రపంచాన్ని పర్యటిస్తున్న వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రెండు తలలున్న బెన్‌ అండ్‌ జెర్రీ అనే పాము మాటువేసి ఎలుకను పట్టుకొని అమాంతం మింగేసి ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘రెండు తలల పాము కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందెన్నడూ రెండు తలల పామును నేను చూసిందే లేదు’ అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv)

మరిన్ని వార్తలు