Viral Video: నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు

12 Aug, 2022 17:14 IST|Sakshi

భారత్‌లో  భారీ వర్షాలతో జలాశయాలన్ని పూర్ణ కుంభంలా ఉంటే యూఎస్‌, యూకేలో భానుడు భగ భగ మంటున్నాడు. దీంతో అక్కడ పలు చోట్ల రైలు పట్టాలు వేడికి వంకర్లు తిరగడం, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చూసుకున్నాయి కూడా. అక్కడ వేడి గాలులకు జంతువులు సైతం తాళ్లేక నీటి కోసం ఆర్రులు చాచుతున్నాయి. తాజాగా న్యూయార్క్‌ ఒక గుర్రపు బండికి ఉన్న గుర్రం వేడిగాలుకు సొమ్మసిల్లి పడిపోయింది.

అసలేం జరిగిందటే... అమెరికాలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఆ ఎండల ధాటికి ఒక​ గుర్రం సోమ్మసిల్లి పడిపోయింది. ఆ గుర్రం ప్రసిద్ధిగాంచిన గుర్రపు జాతుల్లో ఒకటి.  గుర్రపు బండికి ఉన్న గుర్రం రోడ్డు పై వెళ్తు వెళ్తూ... మాన్‌హాటన్‌ హెల్స్‌ కిచెన్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. 

ఆ గుర్రానికి నెత్రిపై సుర్ర మంటున్న ఎండ మరోవైపు వేడిగా ఉ‍న్న తారు రోడ్డు, ఈ రెండిటి ధాటికి బండిని లాగలేక పడిపోయింది. దీంతో రహదారిపై ఉన్న జనాలు ఆ గుర్రపు బండిని తోలే వ్యక్తి పై మండిపడ్డారు. పైగా ఆ వ్యక్తి గుర్రం పడిపోవడానికి ముందు బండిని లాగేలా...కొరడాతో గట్టిగా కొట్టాడాని ఆరోపణలు చేశారు. ఒక్క పక్క వేడుగాలులు, దీనికి తోడు అతను కొట్టడంతో ఆ గుర్రం నడవలేక పోయిందంటూ సదరు వ్యక్తిని  తిట్టడం మొదలు పెట్టారు.

ఈ ఘటనతో న్యూయార్క్‌ అధికారులు ఆ గుర్రాన్ని నీటితో తడుపుతూ సపర్యలు చేశారు. గుర్రాన్ని సంరక్షించే వ్యక్తి కూడా దాన్ని తిరిగి లేచి నిలబడేందుకు సాయం అందిస్తున్నాడు. కానీ ఆ గుర్రం లేచి నిలబడే స్థితిలో లేదు. జంతు ప్రేమికులు ఈ గుర్రాన్ని రైడ్‌ చేయడానికి వినయోగించొద్దని అధికారులను కోరారు. వాస్తవానికి ఆ గుర్రానికి నరాల వ్యాధి ఉందని ఇలా పడిపోతుంటుందని న్యూయార్క్‌ గుర్రాల ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం గుర్రం పశువైద్య సంరక్షణలో ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 

(చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!)

మరిన్ని వార్తలు