చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే!

15 Oct, 2022 18:33 IST|Sakshi

బీజింగ్‌: చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ అక్టోబర్ 16 నుంచి 22 వరకు జరగనుంది. మరో ఐదేళ్లకు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 2,296 మందికిపైగా ప్రతినిధులు ఆదివారం ప్రారంభమయ్యే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టి చరిత్ర సృష్టించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఐదేళ్లకోసారి జరిగే సీపీసీ సదస్సు ఆదివారం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవం అనంతరం అధ్యక్షుడు జిన్‌పింప్‌ ప్రసంగించనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రానున్న ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు.

అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా అరుదైన ఘనత సాధిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈ సదస్సును కఠినమైన కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రెండు రోజుల పాటు కోవిడ్ బబుల్‌లో ఉండాలి.
చదవండి: బొగ్గ గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య

మరిన్ని వార్తలు