నిద్ర మత్తులో బ్రష్‌ మింగేశాడు

5 Aug, 2021 16:58 IST|Sakshi

చిన్నపిల్లలు ఆడుకుంటూ చిన్న చిన్న కాయిన్స్‌ వంటివి మింగేయడం తెలుసు.. కొందరు పెన్ను క్యాప్‌లు, పిన్నీసులు వంటివి మింగడమూ తెలుసు.. కానీ చైనాలోని టైంఝు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవున్న టూత్‌బ్రష్‌ను మింగేశాడు. రాత్రంతా టీవీ చూస్తూ గడిపాడో, బయటెక్కడో తిరిగి లేటుగా వచ్చాడోగానీ.. పొద్దున నిద్రమత్తులో లేచాడు. కళ్లు నలుముకుంటూనే బాత్రూమ్‌కు వెళ్లాడు. బ్రష్‌ తీసుకుని పళ్లు తోముకోవడం మొదలుపెట్టాడు. పళ్ల వెనకాల, నాలుక చివరన తోముతుంటే బ్రష్‌ చేజారి.. గొంతులోకి వెళ్లిపోయింది. తీయడానికి ప్రయత్నిస్తే రాలేదు.

అప్పటికే ఊపిరాడక ఇబ్బంది మొదలవడంతో.. బ్రష్‌ను అలాగే లోపలికి తోసేశాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి పరుగెత్తాడు. డాక్టర్లు వెంటనే గ్యాస్ట్రోస్కోపిక్‌ ఆపరేషన్‌ చేసి బ్రష్‌ను బయటికి తీశారు. నిద్రమత్తులో పేస్ట్‌ అనుకుని షేవింగ్‌ క్రీమ్‌నో, లిక్విడ్‌ సోప్‌నో వేసుకున్నవారిని చూశామని.. కానీ ఇలా బ్రష్‌ మింగేయడం చాలా చిత్రంగా ఉందని డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు