మెడికో ప్రీతి మృతి బాధాకరం

28 Feb, 2023 22:02 IST|Sakshi
మొక్క అందజేస్తున్న వెంకటేశ్వర్లు

కరీంనగర్‌: మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవ్వడం బాధ కలిగిస్తుందన్నారు. ప్రీతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆర్టీసీ ఆర్‌ఎంను కలిసిన హుస్నాబాద్‌ డిపో మేనేజర్‌

కరీంనగర్‌: హుస్నాబాద్‌ డిపో మేనేజర్‌గా సీహెచ్‌ వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు హైదరాబాద్‌–1 డిపో అసిస్టెంట్‌ మేనేజరుగా పనిచేసి ప్రమోషన్‌పై హుస్నాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ ఆర్టీసీ ఆర్‌ఎం ఖుస్రోషాఖాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. తర్వాత డిప్యూటీ ఆర్‌ఎం(వో)చందర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

కరీంనగర్‌క్రైం: సీపీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోలను పట్టుకున్నారు. ట్రాఫిక్‌ సీఐ నాగార్జునరావు, ఎస్సై ఇషాక్‌, లింగారెడ్డి, ఆర్‌ఎస్‌ఐ రాజు, సిబ్బంది వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 150 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ట్రాఫిక్‌ ఏసీపీ జి.విజయకుమార్‌ మాట్లాడు తూ, వాహనాలకు నంబర్‌ప్లేట్‌ లేకపోవడం వల్ల చైన్‌ స్నాచింగ్‌, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు తప్పించుకొనిపోయే అవకా శం ఉంటుదన్నారు. ఆటో డ్రైవర్స్‌, ఓనర్స్‌ ప రిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దని, ఎక్స్‌ ట్రా ఫిట్టింగ్స్‌ చేస్తే చట్టప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

రాష్ట్ర అథ్లెటిక్స్‌లో ప్రతిభ

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ ఐశ్వర్య అద్వితీయ ప్రతిభ కనబరిచింది. 20 సంవత్సరాలలోపు బాలికల విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి జిల్లా పేరును నిలిపింది. ఈ సందర్బంగా ఐశ్వర్యను సర్పంచ్‌ అటికం శారద, ఎంపీటీసీ అటికం రాజేశం, జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి తదితరులు అభినందించారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

గంగుల కమలాకర్‌

మరిన్ని వార్తలు