బాలలు మంచి పౌరులుగా ఎదగాలి..

15 Nov, 2023 00:20 IST|Sakshi
డీసీసీబీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన సీఈఓ నర్మద, అఽధికారులు

ఖమ్మంలీగల్‌: బాలలందరూ శ్రద్ధగా చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌పాషా సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం బాలల సదన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. బాలలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు దరిచేరేలా న్యాయసేవా సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణువందన మాట్లాడగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సదన్‌ పర్యవేక్షకురాలు వరలక్ష్మి, న్యాయవాదులు కె.చంద్రశేఖర్‌, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి

వచ్చేనెల 9న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో బ్యాంకర్లు రుణ వసూలు కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జావేద్‌ పాషా సూచించారు. వివిధ బ్యాంకుల అధికకారులతో సమావేశమైన ఆయన లోక్‌ అదాలత్‌ విధివిధానాలు, లాభాలను వివరించారు.

సహకార వారోత్సవాలు ప్రారంభం

ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా సహకార వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సహకార ప్రగతి, ఆర్థిక స్థితిగతులు, లక్ష్యాలు తదితర అంశాలను మననం చేసుకోవటంతో పాటు అవగాహన కల్పించేందుకు గాను ఏటా నవంబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈమేరకు మంగళవారం ఖమ్మంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ కె.నర్మద సహకార జెండాను ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ ఏ.పద్మావతి, అధికారులు పాల్గొన్నారు. అలాగే, డీసీసీబీ బ్రాంచ్‌లు, పీఏసీఎస్‌ల్లోనూ వారోత్సవాలు మొదలుకాగా, జిల్లా సహకార అధికారి విజయకుమారి పర్యవేక్షిస్తున్నారు.

‘ఓపెన్‌’ ప్రవేశాలకు స్పెషల్‌ డ్రైవ్‌

ఖమ్మంసహకారనగర్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు ప్రవేశాలు పొందొచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు (80084 03522)ను సంప్రదించాలని డీఈఓ సూచించారు.

మరింత సరళంగా

ఏపీజీవీబీ సేవలు

కామేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు(ఏపీజీవీబీ) ద్వారా ఖాతాదారులకు సేవల ను మరింత సరళీకృతం చేస్తున్నట్లు బ్యాంకు చైర్మన్‌ కె.ప్రతాపరెడ్డి వెల్లడించారు. కామేపల్లి మండలం పండితాపురంలోని ఏపీజీవీబీ బ్రాంచ్‌ను సందర్శించిన ఆయన ఖాతాదారులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను విస్తరిస్తూ ఖాతాదారులకు సేవలందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ఆతర్వాత పలువురు ఉద్యోగులను చైర్మన్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం ఎం.ఉదయ్‌కుమార్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ జె.సత్కీర్తితో పాటు జయప్రకాశ్‌, జోగారెడ్డి, వరుణ్‌, శివమోహన్‌, ఉమారాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు