హజ్‌ యాత్ర దరఖాస్తులకు నేడే ఆఖరు

20 Mar, 2023 02:06 IST|Sakshi

కర్నూలు(రాజ్‌విహార్‌): హజ్‌కు వెళ్లే యాత్రికులు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు ముగుస్తుందని రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు హాఫిజ్‌ మంజూర్‌ అహ్మద్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2023 హజ్‌ మార్గదర్శకాల మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉందన్నారు. దరఖాస్తుకు పాస్‌పోర్టు మొదటి, చివరి పేజీల కలర్‌ జిరాక్స్‌ కాపీని జత చేయాలని, పాస్‌పోర్టు గడువు 2024 ఫిబ్రవరి 3 వరకు ఉండాలని పేర్కొన్నారు. జాతీయ బ్యాంక్‌ ఖాతా పాస్‌ బుక్‌ కలర్‌ జిరాక్స్‌/ క్యాన్సిల్డ్‌ చెక్కు కాపీ, అభ్యర్థులు మెడికల్‌ స్క్రీనింగ్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, కోవిడ్‌–19 వ్యాక్సిన్స్‌ వేసుకున్న సర్టిఫికెట్లు జత చేయాలని చెప్పారు. అలాగే 3.5‘‘3.5 సైజులో రెండు కలర్‌ ఫొటోలు సమర్పించాలని, దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. 2023 ఏప్రిల్‌ 30లోపు 70 ఏళ్లు పూర్తయ్యే వారికి డిప్‌ పద్ధతి కాకుండా నేరుగా ఎంపిక చేయడంతో పాటు వారి వెంట మరొకరికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు సోమవారం సాయంత్రం లోపు కర్నూలులోని బుధవారపేటలో మహబూబ్‌ సుబాహాని మసీదులోని రాయలసీమ హజ్‌ సొసైటీ కార్యాలయంలో, పెద్ద మార్కెట్‌ సమీపంలోని అబుబక్కర్‌ మసీదులో ఉన్న జిల్లా హజ్‌ సొసైటీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు ఉచితంగా పొందవచ్చన్నారు. అన్ని ధ్రువ పత్రాలు తీసుకెళ్తే అక్కడే కంప్యూటర్‌లో ఉచితంగా ఆన్‌లైన్‌ కూడా చేస్తారని తెలిపారు. వివరాలకు సెల్‌: 94402 32564, 99085 45232 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు