వంద పనిదినాల పూర్తికి చర్యలు | Sakshi
Sakshi News home page

వంద పనిదినాల పూర్తికి చర్యలు

Published Mon, Mar 20 2023 2:06 AM

 ఉపాధి పనుల్లో కూలీలు
 - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లక్ష్యం. ఇప్పటి వరకు దాదాపు 3000 కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఈ లోపు 90 నుంచి 99 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న అన్ని కుటుంబాలకు 100 రోజులు పని కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు అవసరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. 90 నుంచి 99 రోజుల మధ్య పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు జిల్లాలో 15,448 ఉన్నాయి. ఈ కుటుంబాలను ఉపాధి పనులకు రప్పించి 100 రోజుల పనులు పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ అమరనాథరెడ్డి ఏపీడీలు, పీవో,ఏపీవోలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా కుటుంబాల పనిదినాల జాబితాలను ఏపీడీలు, మండల స్థాయి అధికారులకు పంపారు. ఆయా కుటుంబాలకు 100 రోజులు పనులు కల్పిస్తే.. ఈ ఏడాది దాదాపు 20 వేల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఉపాధి పనులు కల్పించినట్లవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement