బడి బాగుంది | Sakshi
Sakshi News home page

బడి బాగుంది

Published Mon, Nov 20 2023 2:02 AM

- - Sakshi

మా ఊర్లో పాఠశాల గతంలో అధ్వానంగా ఉండేది. పిల్లలు బలవంతంగా బడికి పోయేవాళ్లు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాఠశాలు రూపురేఖలు మారిపోయాయి. నాడు–నేడు కింద మా ఊరి బడిని బాగు చేశారు. మరుగుదొడ్డి సదుపాయం కల్పించారు. పిల్లలను ఆకర్షించేలా తరగతి గదులను తీర్చిదిద్దారు. నా ఇద్దరు కూతుళ్లను ఊళ్లో బడిలోనే చేర్పించా. విద్యా కానుక కింద యూనిఫాం, పుస్తకాలు, బూట్లు నోట్‌ పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు. అమ్మఒడి కింద ఏటా రూ.15000 అందుతోంది. పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించారు. టీచర్లు కూడా బడికి సమయానికి వస్తున్నారు. ప్రవేటు స్కూళ్ల కంటే గవర్నమెంటు బడులు చాలా బాగున్నాయి. – మద్దిలేటి, ముక్కెల్ల, తుగ్గలి మండలం

Advertisement
Advertisement