ఓటేద్దాం.. రండి!

30 Nov, 2023 00:48 IST|Sakshi

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

వరంగల్‌ పశ్చిమ 1,37,139 1,39,976 10 2,77,125

పరకాల 1,06,451 1,10,601 02 2,17,054

వరంగల్‌ తూర్పు 1,20,323 1,25,621 338 2,46,282

నర్సంపేట 1,11,870 1,14,742 05 2,26,617

వర్ధన్నపేట 1,28,722 1,31,818 15 2,60,555

జనగామ 1,14,626 1,14,973 10 2,29,609

పాలకుర్తి 1,22,040 1,21,682 08 2,43,730

స్టేషన్‌ఘన్‌పూర్‌ 1,20,848 1,22,132 01 2,42,981

మహబూబాబాద్‌ 1,21,441 1,24,289 35 2,45,765

డోర్నకల్‌ 1,05,886 1,08,242 26 2,14,154

భూపాలపల్లి 1,33,461 1,34,562 05 2,68,028

ములుగు 1,08,588 1,12,277 21 2,20,886

మొత్తం 13,31,395 14,60,915 476 28,92,786

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియగా.. గురువారం పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ప్రచారం సాఫీగా సాగింది. ఈక్రమంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సౌకర్యాలు కల్పించారు. 3,294 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుండగా.. 6,332 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ను సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు. కాగా 12 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి 36 మంది బరిలో నిలవగా.. బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ తదితర పార్టీలతోపాటు స్వతంత్రులు కలిపి 213మంది పోటీలో నిలిచారు. మొత్తం 28,92,786 మంది ఓటర్లలో 12,098 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,036 మంది దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటేసేందుకు దరఖాస్తు చేసుకుని 3,912 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2018.. 2023 ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

2018 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. 2023 ఎన్ని కల షెడ్యూల్‌ తేదీలు కొద్దిగా అటూఇటుగా ఉన్నాయి. 2018లో ఎన్నికల షెడ్యూల్‌ అక్టోబర్‌ 6న విడుదల చేస్తే, ఈసారి మూడ్రోజులు ఆలస్యంగా అక్టోబర్‌ 9న ప్రకటించారు. 2018లో నోటిఫికేషన్‌ నవంబర్‌ 12న జారీ కాగా.. ప్రస్తుతం తొమ్మిది రోజులు ముందుగా నవంబర్‌ 3న వేశారు. ఇదే తరహాలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తేదీల్లో కొన్ని రోజుల వ్యత్యాసం ఉంది. కాగా.. గత ఎన్నికల పోలింగ్‌ డిసెంబర్‌ 7న జరగగా.. ప్రస్తుతం నవంబర్‌ 30న జరగనుంది. అప్పుడు డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడించారు. ప్రస్తుతం డిసెంబర్‌ 3న రిజల్ట్‌ రానుంది.

కేంద్రాలకు ఈవీఎంలు సిబ్బంది..

960 సమస్యాత్మకం..

2018 ఎన్నికల్లో జరిగిన అల్లర్లు, గొడవలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 నియోజకవర్గాల్లో 960 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. అత్యధికంగా ములుగులో 261, తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలో 112 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు ప్రకటించారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మారుమూల అటవీ ప్రాంతాలు, రాష్ట్ర సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. కాగా.. ఈ రెండు జిల్లాల్లో గంట ముందు అంటే సాయంత్రం 4గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. బుధవారం రాత్రి వరకు ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎలక్ట్రానిక్‌ యంత్రాలతో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ నీడలో పోలింగ్‌ జరగనుంది. కాగా.. సమస్యాత్మక కేంద్రాలతో పాటు సాధ్యమైనచోట వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసి, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. కాగా సమస్యాత్మక కేంద్రాల పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తనిఖీలు, కార్డన్‌సెర్చ్‌లు చేపడుతున్నారు. అనుమానితులపై నిఘా పెట్టడంతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

నేడే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌

ఉమ్మడి జిల్లాలో 28,92,786 మంది ఓటర్లు.. 3,294 పోలింగ్‌ కేంద్రాలు

పోలింగ్‌ నిర్వహణకు

యంత్రాంగం సన్నద్ధం

కేంద్రాలకు చేరిన ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణ అఽధికారులు

12 నియోజకవర్గాల్లో

213 మంది అభ్యర్థులు..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌,

బీజేపీ నుంచి 36 మంది

నియోజకవర్గం మొ.బూత్‌లు సమస్యాత్మకం

వరంగల్‌ పశ్చిమ 244 58

వరంగల్‌ తూర్పు 230 51

స్టేషన్‌ఘన్‌పూర్‌ 290 64

పాలకుర్తి 294 63

వర్ధన్నపేట 278 70

పరకాల 239 58

భూపాలపల్లి 317 112

డోర్నకల్‌ 256 37

ములుగు 303 261

మహబూబాబాద్‌ 283 37

జనగామ 277 87

నర్సంపేట 283 62

మొత్తం 3,294 960

మొత్తం ఓటర్లు:

28,92,786

పురుష ఓటర్లు:

13,31,395

మహిళా ఓటర్లు:

14,60,915

ఇతర ఓటర్లు: 476

పోలింగ్‌ స్టేషన్లు: 3,294

సమస్యాత్మకం: 960

పోటీలో ఉన్న

అభ్యర్థులు:

213

మరిన్ని వార్తలు