KPAC Lalitha : ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత

23 Feb, 2022 08:24 IST|Sakshi

Actress KPAC Lalitha Passes Away Celebrities Condolences: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్​ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటనకు అదే ఇంటిపేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్​ అండ్​ ఆర్ట్​ స్కూల్​ రెండింటిలోనూ బాగా రాణించింది ఈ లెజండరీ నటి. 

ఆమె ఐదేళ్ల సినీ కెరీర్​లో 550కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్​పర్సన్​గా సేవలు కూడా అందిచారు లలిత. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్​ను వివాహం చేసుకున్న ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్​, కుమార్తె శ్రీకుట్టి భరతన్​ ఉన్నారు. లిలిత మృతిపట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. 
 


పృథ్వీరాజ్​ సుకుమారన్​తో పాటు అనేకమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్​ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఈ లెజండరీ నటి మృతిపట్ల కీర్తి సురేష్​, మంజూ వారియర్ భావోద్వేగపు పోస్ట్​లు పెట్టారు. ​కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సంతాపం తెలియజేశారు. 'లలిత తన నటనా నైపుణ్యంతో విభిన్న తరాల హృదయాల్లోకి అల్లుకుపోయారు. చరిత్రలో నిలిచిపోయారు' అని పేర్కొన్నారు. 
 

>
మరిన్ని వార్తలు