ప్రభాస్‌తో పోటీకి బాలీవుడ్‌ భామ సై

24 Feb, 2021 19:13 IST|Sakshi

బాలీవుడ్‌ భామ అలియా భట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గంగూభాయ్‌ కతియావాడి. ఈ చిత్రంలో ఆలియాభ‌ట్ సెక్స్‌వ‌ర్క‌ర్‌గా న‌టిస్తుండగా..  బాలీవుడ్ స్టార్స్ అజ‌య్‌దేవ్‌గ‌న్‌, ఇమ్రాన్ హ‌ష్మీ, హ్యూమా ఖురేషి త‌దిత‌రులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా నేడు(ఫిబ్రవరి24) సంజ‌య్ లీలా భ‌న్సాలీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ చిత్రం టీజర్‌తోపాటు విడుదల తేదిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినిమాలోని తన పోస్టర్‌ను అలియా షేర్‌ చేశారు. అయితే గంగూభాయ్‌ అదే నెలలో రిలీజ్‌ అవుతున్న మరో భారీ చిత్రంతో పోటీపడనుంది. అదే తేదీ జులై 30న ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’‌ చిత్రం విడుదల కానుంది.

రాధే శ్యామ్‌ తెలుగుతో పాటు పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందులో హిందీ కూడా ఒకటి. దీంతో ఈ రెండు చిత్రాలు బీటౌన్‌ బాక్సాఫీస్‌ వద్ద తలపడనున్నాయి. మరి రెండు సినిమా పోటీ పడతాయా లేదంటే ఎవరైనా వెనక్కి తగ్గుతారా అనేది వేచి చూడాలి. వాస్తవానికి గుంగూభాయి గతేడాది సెప్టెంబర్‌ 11నే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడటంతో రిలీజ్‌ వాయిదా పడింది. మూవీ స్టోరి విషయానికొస్తే మాఫియా రారాణి గంగూభాయి కతియావాడికి చెందిన కథ. ఫేమస్ రైటర్ జైదీ రాసిన పుస్తకం ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అంతేగాక అలియాకు సంజయ్‌ లీలాతో ఇది తొలి ప్రాజెక్టు. దీనికంటే ముందు సల్మాన్‌ఖాన్‌ నటించిన ఇన్షల్లాలో ఈ చిత్ర నిర్మాతతో కలిసి నటించాల్సి ఉంది. కానీ అది ఆగిపోయింది. మరోవైపు అలియా తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో నటిస్తోంది. అక్టోబర్‌ 13న ఈ సినిమా విడుదలకానుంది. 
చదవండి: రామ్‌చరణ్‌–ఆలియా పోటాపోటీగా..

ఆదిపురుష్‌: ప్రభాస్‌ ఫొటో వైరల్‌

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు