‘ఇప్పటికి నా భార్యకి లవ్‌ లెటర్స్‌ రాస్తాను’

19 Nov, 2020 11:29 IST|Sakshi

కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక షోని రక్తికట్టించడంలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్‌ సీటులో కూర్చున్న వారిని నవ్విస్తూ.. టెన్షన్‌ పెడుతూ.. వారి జీవితం గురించి తెలుసుకుంటూ.. తన ప్రయాణం గురించి వారికి చెప్తూ షోపై ఆసక్తి పెంచుతారు. ఇక తాజా ఎపిసోడ్‌లో మహారాష్ట్రకు చెందిన రైతు యోగేష్‌ పాండే ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ రౌండ్‌లో గెలిచి హాట్‌ సీట్‌లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కేబీసీ టీం యోగేష్‌కు సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్‌ని ప్రసారం చేసింది. ఇక యోగేష్‌, బిగ్‌ బీల మధ్య జరిగిన సంభాషణ హాట్‌ సీటును కాస్త కూల్‌గా మార్చేసింది. ఇక గేమ్‌లో ముందుకు వెళ్తున్న కొద్ది యోగేష్‌ తనకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తనకు నిశ్చితార్థం అయ్యిందని తెలిపాడు యోగేష్‌. అయితే కరోనా వ్యాప్తితో వివాహం పోస్ట్‌ పోన్‌ అయ్యిందని.. కానీ తామిద్దరూ ప్రతి రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటామని.. వీడియో కాల్‌ చేసుకుంటామని తెలిపాడు. ఈ విషయాలేవి ఇంట్లో వారికి తెలియదన్నాడు యోగేష్‌. ఇక ఈ లవ్‌ స్టోరిని అర్థం చేసుకోవడానికి బిగ్‌ బీ, యోగేష్‌ లవర్‌గా మారి పోయారు. కంటెస్టెంట్‌కి కాల్‌ చేసి అతడి లవర్‌గా మాట్లాడి సెట్‌లో నవ్వులు పూయించారు. (మళ్లీ వివాదం: అమితాబ్‌పై కేసు)

ఇక ఎలాంటి లైఫ్‌లైన్‌ల సాయం లేకుండానే యోగేష్‌ గేమ్‌లో ముందుకు వెళ్లాడు. ఇక వివాహ జీవితం గురించి తనకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా యోగేష్, బిగ్‌ బీని కోరాడు. అలానే అమితాబ్‌ లవ్‌ స్టోరిని చెప్పమని అడగడమే కాక భార్య జయా బచ్చన్‌కి ఏవైనా లవ్‌ లెటర్స్‌ రాశారా అని ప్రశ్నిస్తాడు యోగేష్‌. దాంతో అమితాబ్‌ మరోసారి తన లవ్‌ స్టోరిని ప్రేక్షకులకు తెలిపారు. అంతేకాక ఇప్పటికి తన భార్య జయా బచ్చన్‌కి లవ్‌ లటర్స్‌ రాస్తానని తెలిపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక బిగ్‌బీ తన లవ్‌ స్టోరిని గుర్తు చేసుకుంటూ.. ‘1973లో విడుదలైన జంజీర్‌ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. దాంతో స్నేహితులతో కలిసి లండన్‌ ట్రిప్‌ వెళ్లాలని భావించాను. నాతో పాటు జయా బచ్చన్‌ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాను. మా నాన్న హరివంశరాయ్‌ బచ్చన్‌ అనుమతి కోరాను. దానికి ఆయన ముందు మీరిద్దరు వివాహం చేసుకొండి.. ఆ తర్వాత వెళ్లండి అన్నారు. దాంతో ఆ మరుసటి రోజే జయా బచ్చన్‌ని వివాహం చేసుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ షోటో యోగేష్‌ పాండే 12.50 లక్షల రూపాయల ప్రశ్నకి తప్పు సమాధానం చెప్పి.. 3,20,000 రూపాయలతో ఇంటికి వెళ్లాడు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా