ప్రభాస్ క్రేజ్‌.. డార్లింగ్‌ పేరిట క్యాండీస్‌!

21 Aug, 2020 13:32 IST|Sakshi

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.‘సాహో’ సినిమాతోనూ వసూళ్లపరంగా సత్తా చాటి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలకు జపాన్‌లో లభించిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్‌ నటనకు ఫిదా అయిన జపాన్‌వాసులు ‘బాహుబ‌లి’తో పాటు ‘సాహో’పై కూడా కలక్షన్ల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు అక్కడ కొంతమంది ఫ్యాన్స్‌ మరో ముందడుగు వేసి.. ప్రభాస్‌ పేరిట షుగర్‌లెస్‌ మింట్‌ క్యాండీస్‌ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు.(దంగల్‌ రికార్డును బద్దలు కొట్టిన సాహో!)

కాగా గతంలో చైనాలోనూ డార్లింగ్‌ అభిమానులు ప్రభాస్‌ ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రభాస్‌తో పాటు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ల పేర్లన్నింటితో ఫుడ్‌ ఐటమ్స్‌ను విక్రయించారు. ఇక బాహుబలి తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న డార్లింగ్ ‘సాహో’తో సందడి చేసినా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు‌. అందుకే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ‘రాధేశ్యామ్‌’ సినిమాను లైన్‌లో పెట్టిన ప్రభాస్‌.. ‘మహానటి’ ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ మూవీలో నటించనున్నాడు.(సీతగా మహానటి?)

ఇక బాలీవుడ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ పాన్‌ ఇండియా స్టార్‌.. ‘ఆదిపురుష్‌’ అనే పౌరాణిక చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనువిందు చేయనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూడు సినిమాల బడ్జెట్‌ కలిపి మొత్తంగా సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని వినికిడి. దీంతో ఎటువంటి రికార్డు సృష్టించాలన్నా తమ హీరోకి మాత్రమే సాధ్యమవుతుందంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.
 

మరిన్ని వార్తలు