అదిరిపోయేలా ‘పుష్ఫ’ ఐటమ్‌ సాంగ్‌!

1 Sep, 2020 17:38 IST|Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచనాలున్నాయి. కరోనా మూలంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌లో రాక్‌స్టార్‌ డీఎస్పీ సినిమాకు సంబంధించిన అన్ని పాటలు కంపోజింగ్‌ చేశారట. అందులో ఓ ఐటమ్​ సాంగ్ ఫ్యాన్స్‌ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సుకుమార్‌- డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన ఐటమ్స్‌ సాంగ్స్‌ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. అలాగే బన్నీ-డీఎస్పీ కాంబో అంటే రాకింగ్‌ ఆల్బమ్‌ కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో పుష్ప ఆల్బమ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా రాక్‌స్టార్‌ పుష్ప సాంగ్స్‌ని కంపోజ్‌ చేసినట్లు తెలుస్తోంది.
(చదవండి : కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసిన హాస్య న‌టి)

 మరోవైపు పుష్ప సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందట. షూటింగ్‌లో పాల్గొనేందుకు బన్నీ రెడీగా ఉన్నా..సుకుమార్ మాత్రం ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్ షురూ చేసేందుకు సుముఖంగా లేడ‌ట‌.షూటింగ్‌కి మరికొద్ది రోజులు సమయం తీసుకుందామని సుక్కు చెప్పినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు సినిమాటోగ్రాఫ‌ర్ మిరొస్లా బ్రొజెక్ లాక్ డౌన్ కు ముందే పోలండ్ కు వెళ్లిపోగా..మ‌ళ్లీ ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. మిరొస్లా భార‌త్ కు వ‌చ్చి సుకుమార్ తో క‌లిసి లొకేష‌న్ల‌ను ఫిక్స్ చేసిన త‌ర్వాత షూటింగ్ షెడ్యూల్ ను ఫైన‌లైజ్ చేయ‌నున్నారు. ఇదంతా జ‌ర‌గాలంటే మ‌రికొన్ని వారాలు ప‌ట్టే అవ‌కాశం ఉంది. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు