ఆలయంలో ముద్దు సన్నివేశాలు

24 Nov, 2020 16:04 IST|Sakshi

హిందువులకు నెట్‌ఫ్లిక్స్‌ క్షమాపణలు చెప్పాలి

భారతీయ యువ మోర్చా డిమాండ్‌

భోపాల్‌: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే సత్యం లింగరాజు నిజ జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించి కోర్టు చుట్టూ తిరుగుతున్న నెటిఫ్లిక్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ సంస్థ ప్రతినిధులపై భారతీయ యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ మధ్యప్రదేశ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేగాక పవిత్ర దేవాలయంలో ముద్దు సీన్‌లు చిత్రీకరించి మనోభావాలు దెబ్బతీసినందుకు నెట్‌ఫ్లిక్స్‌ హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర ఆలయంలో ఈ ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. అంతేగాక ఇది లవ్ జిహాద్‌ను కూడా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. (చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్)

గౌరవ్ తివారీ ఫిర్యాదు మేరకు నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోనికా షెర్గిల్‌, పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంబికా ఖురాలనాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరొత్తం మిశ్రా తెలిపారు. దేవాలయంలో ముద్దు సన్నివేశాలు చిత్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లవడంతో సంస్థ ప్రతినిధులైన మోనికా షెర్గిల్‌, అంబికా ఖురానాలపై ఐపీసీ 295 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు ఇంకా స్పందించ లేదు. కాగా ‘ఏ సూటబుల్‌ బాయ్‌’లో సినీనటి టబు కూడా నటించారు. ఇందులో టబుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌కు ప్రముఖ చిత్రనిర్మాత మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ‘సలాం బాంబే’, ‘మాన్ సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్‌సెక్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ఆమె విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. (చదవండి: కోహ్లి ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా