Ilayaraja: వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు 

19 Apr, 2022 08:01 IST|Sakshi

సాక్షి, చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్‌ అంబేడ్కర్‌తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇళయరాజా వ్యాఖ్యలను కొందరు ఖండిస్తున్నారు. 

ఇళయరాజా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఎంపీ పదవి కోసమే మోదీ భజన చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ విషయంపై ఇళయరాజా సోదరుడు, బీజేపీ సభ్యుడు గంగై అమరన్‌ స్పందిస్తూ.. అందరిలాగే ఇళయరాజా కూడా తన భావాలను వ్యక్తం చేశానని చెప్పారన్నారు. తన మాటల్లో తప్పు లేదనీ, అందుకు ఎలాంటి విమర్శలు ఎదురైనా తాను ఎదుర్కొంటానన్నారని, అదేవిధంగా తాను బీజేపీలో చేరలేదని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారని స్పష్టం చేశారు. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా స్పందిస్తూ.. కరుప్పు ద్రవిడన్‌ గర్వించదగ్గ తమిళన్‌ అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు