Miss Earth India 2023: 'మిస్‌ ఎర్త్‌ ఇండియా'గా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కూతురు

29 Aug, 2023 16:16 IST|Sakshi

రాజస్థాన్‌కు చెందిన ప్రియన్‌ సైన్‌ (20)... మిస్‌ ఎర్త్‌ ఇండియా 2023గా ఎంపికైంది. దీని ద్వారా డిసెంబర్‌లో వియత్నాంలో జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ ఎర్త్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 'డివైన్ బ్యూటీ' పేరుతో జరిగే ఈ ఈవెంట్‌లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా, మిస్ ఎర్త్ ఇండియా అవార్డులను అందజేస్తారు. మిస్ రాజస్థాన్ 2022 అందాల పోటీలో ప్రియన్ సైన్ మొదటి రన్నరప్‌గా నిలిచి గుర్తింపు పొందింది. తాజాగ ఈ ఈవెంట్‌ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మిస్ ఎర్త్ ఇండియా ఈవెంట్ జరిగింది. దీనిని దీపక్ అగర్వాల్ డివైన్ బ్యూటీ వారు ఈ పోటీని నిర్వహించారు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు)

16 మంది ఫైనలిస్టులలో ప్రియన్ సైన్ ఒకరు. అనేక పోటీల్లో గెలుపొందిన ఆమె ఇప్పుడు మిస్ ఎర్త్ ఇండియా 2023గా అవతరించింది. విజేతగా ప్రకటించిన వెంటనే ప్రియన్ సైన్ భావోద్వేగానికి గురయ్యారు. మిస్ రాజస్థాన్ 2022లో ప్రియన్ మొదటి రన్నరప్‌గా నిలిచిందని మిస్ రాజస్థాన్ నిర్వాహకులు, ప్రియన్ సైన్ మెంటార్ యోగేష్ మిశ్రా, నిమిషా మిశ్రా తెలిపారు. మెడిసిన్ చదువుతూనే ప్రియన్ సైన్ మిస్ ఇండియాకు కూడా సిద్ధమవుతోంది.

(ఇదీ చదవండి: ధృవ సినిమాకు సీక్వెల్‌ రెడీ.. టీజర్‌ విడుదల కానీ..)

ప్రియన్ తల్లి రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రియన్‌కు తల్లి మాత్రమే ఉంది, ఆమెను కొడుకులా పెంచింది. దీని గురించి ప్రియన్ సైన్ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. మిస్ ఇండియా, మిస్‌ వరల్డ్‌ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపింది. 2019 మిస్‌ ఎర్త్‌ ఇండియాగా తెలంగాణకు చెందిన మహబూబ్‌ నగర్‌ బిడ్డ డాక్టర్‌ తేజస్వి మనోజ్ఞ గుర్తింపు పొందారు. 

A post shared by 𝐌𝐢𝐬𝐬 𝐃𝐢𝐯𝐢𝐧𝐞 𝐁𝐞𝐚𝐮𝐭𝐲 (@divinegroupindia)

మరిన్ని వార్తలు