చిరు న్యూలుక్‌ వైరల్‌.. ఫీలవుతున్న పవన్‌ ఫ్యాన్స్‌ .. కారణం అదేనా?

12 Aug, 2021 11:28 IST|Sakshi

ఫ్యాన్స్‌ తమ హీరోల విషయంలో చిన్న విష‌యాన్ని కూడా పెద్ద భూత‌ద్దంలో పెట్టి చూస్తారన్న సంగతి తెలిసిందే. అంతెందుకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభిమానులు రెచ్చిపోయిన ఘటనలు బోలెడు ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ విషయంలో ఏ చిన్న విషయమైనా.. ఆయన అభిమానులు ఓ రేంజ్‌లో స్పందిస్తారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అది పవన్‌ ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోందట.

ఇటీవల సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి అందులో పోస్ట్‌ చేసే వాటిలో ఏ చిన్న పొరపాటు కూడా వెంటనే వైరల్‌గా మారి అందరికీ చేరుతోంది. ఇక అందులో కంటెంట్‌ కొంచెం అటు ఇటుగా ఉన్న రచ్చ రచ్చ అవుతోంది. అయితే తాజాగా చిరు యంగ్‌గా కనపడుతున్న ఫోటోను మెగా బ్రదర్‌  నాగబాబు షేర్‌ చేయగా అది నెట్టింట వైరల్‌గా మారి తెగ హల్‌చల్‌ చేస్తోంది. అసలు చిక్కు ఈ ఫోటోతోనే వచ్చింది. ఆ ఫోటోలో.. చిరంజీవిని మ‌ధ్య‌లో ఉంచి చుట్టూ మెగా హీరోల‌ని ఉంచాడు. ఆ పిక్‌కి కామెంట్ పెట్టిన నాగ‌బాబు.. ఈ పిక్‌లో ఉన్న మెగా హీరోలు అంద‌రిలో కెల్లా మీరే యంగ్‌గా క‌నిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్‌లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా’’ అంటూ చిరు పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 అయితే నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటోలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు . దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. కాగా పవన్ అభిమానులు ఈ అంశంపై సోషల్‌మీడియాలో నాగబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. మరికొందరు మాత్రం నాగ‌బాబు మ‌న‌సులో త‌న త‌మ్ముడు కూడా ఇంకా యంగ్‌గా ఉన్నాడని భావిస్తున్నట్టున్నాడు అందుకే ఫొటో మిస్ చేశాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు