రాగిణి విడుదల ఆలస్యం 

24 Jan, 2021 08:44 IST|Sakshi

యశవంతపుర: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నటి రాగిణికి సుప్రీంకోర్టులో బెయిల్‌ లభించిన విషయం తెల్సిందే. అయితే రూ.2 లక్షల బాండ్‌ ఇవ్వటంలో జాప్యం జరగడంతో ఆమె విడుదల ఆలస్యమవుతోంది. కరోనా నేపథ్యంలో జామీనుదారుడు ష్యూరిటీ నగదు నేరుగా చెల్లించడానికి వీలు కావడం లేదు. వీడియో ద్వారా విచారణ జరుపుతున్నందున బాండ్‌ను జడ్జికి చూపించాలి. జడ్జి బాండ్‌ను పరిశీలించిన తరువాతనే రాగిణిని విడుదల చేయనున్నారు. మంగళవారం రిపబ్లిక్‌డే ఉండటంతో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డ్రగ్స్‌ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు