నా జీవితాన్ని పరిపూర్ణం చేశారు: దీపికా

14 Nov, 2020 15:06 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ రియల్‌ లైఫ్‌లోని చూడముచ్చటి జంటల్లో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె జంట కూడా ఒకటి. 2018లో వివాహం చేసుకున్న వీరు తమ దాంపత్య జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారని నిరంతరం సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్‌లను చూస్తే అర్థమవుతుంది.ఇక నవంబర్‌ 14 నాటికి వీరి వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తి కాగా, వీరిరువురు సోషల్‌ మీడియాలో ఒకరికొకరు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఒక సరస్సు ప్రాంగణంలో దీపిక తెల్లరంగు కుర్తాపై పింక్‌ గులాబీల మేళవంతో ఉ‍న్న డ్రెస్‌ వేసుకొని ఉంటే, దానికి మ్యాచింగ్‌గా రణ్‌వీర్‌ కూడా అలాంటి కుర్తానే ధరించి, దీపికాని చుట్టిముట్టినట్లు ఉన్న రొమాంటిక్‌ ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ‌ ‘‘మన ఆత్మలు ఒకటిగా ముడిపడి ఉన్నాయి. పెళ్లిరోజు శుభాకాంక్షలు దీపికా’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దానికి దీపికా కూడా ‘‘శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే, మీరు నా జీవితాన్ని పరిపూర్ణం చేశారు’’ అంటూ రీపోస్ట్‌ చేశారు. కాగా, వీరిరువురు 2018లో ఇటలీలోని లేక్‌ కోమోలో పెళ్లి చేసుకొని, వారి సొంత ప్రదేశమైన బెంగళూరులో, తర్వాత బంధువులు, స్నేహితుల కోసం ముంబైలో ఇలా రెండు సార్లు రిసెప్షన్‌ జరుపుకున్నారు. ఇక వీరిద్దరు కలిసి రామ్‌ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కలిసి నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా