Saidabad: సైదాబాద్‌ నిందితుడి మృతిపై చిరు ఏమన్నారంటే..

16 Sep, 2021 16:42 IST|Sakshi

వారం రోజులుగా తెలంగాణలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజుకు తగిన శిక్ష వేయాల‌ని కొందరు, మరణ శిక్షే సరైనదని మరొకొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులు, సెల‌బ్రిటీలు ఉన్నారు. ఆ కీచకుడి మరణ వార్త అందరిలోనూ కాస్త సంతోషాన్ని నింపిందనే చెప్పాలి.

దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మృతి స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ ద్వారా తన స్పందించారు. అందులో.. అభం శుభం తెలియ‌ని ఆరేళ్ల చిన్నారిపై హ‌త్యాచారానికి పాల్ప‌డిన రాజు అనే కిరాత‌కుడు త‌న‌కు తాను శిక్ష‌ను విధించుకోవ‌డం బాధిత కుటుంబంతో పాటు మిగ‌తా అంద‌రికి కొంత ఊర‌ట క‌లిగిస్తుంది. ఈ సంఘ‌ట‌న‌పై మీడియా, పౌర స‌మాజం గొప్ప‌గా స్పందించాయి. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు ప్ర‌భుత్వంతో పాటు పౌర స‌మాజ చొర‌వ చూపాలి.

అలాంటి కార్యక్ర‌మాలు ఎవ‌రు చేప‌ట్టినా నా స‌హ‌కారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్ర‌భుత్వం త‌గిన విధంగా ఆదుకోవాలని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా గురువారం ఘనపూర్ రైల్వే ట్రాక్ఫై రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి చేతిపై ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్థారించారు. ప్రస్తుతం రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చదవండి: ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్‌ మర్మమేమిటి?

మరిన్ని వార్తలు