వాళ్లు నన్ను మోసం చేశారు: నటి షబానా అజ్మీ

24 Jun, 2021 20:46 IST|Sakshi

ప్రస్తుతం లైవ్‌ షాపింగ్‌ కంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నారు. బాలీవుడ్‌ నటి షబానా అజ్మీకు ఇటువంటి అనుభవం ఎదురైంది. షబానా గురువారం నాడు ఆన్‌లైన్ డెలివరీ సంస్థ లిక్విడ్జ్‌ లివింగ్‌లో మద్యం కోనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తాన్ని ఆమె ముందే జమచేసింది కూడా. కాగా వాళ్లు చెప్పిన సమయం మించి పోతున్నా డెలివరీ రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది.

ఈ రకంగా మరెవరూ మోసపోకూడదని భావించి ఆ సంస్థ పేరు తెలుపుతూ తను లావాదేవీ జరిపిన ఫోటోని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అందులో ఆమె.. "జాగ్రత్తగా ఉండండి, నన్ను వాళ్లు మోసం చేశారు. # లిక్విడ్జ్ లైవింగ్‌కు ముందే నేను డబ్బును చెల్లించాను, అనంతరం నేను పెట్టిన ఆర్డర్ రాకపోవడంతో కాల్‌ చేస్తుంటే ఎటువంటి సమాచారం లేదని’ తెలిపింది. అయితే, ఆమె ఎంత మొత్తంలో పంపిందనే విషయాన్నితెలపలేదు. గతంలో కూడా అక్షయ్ ఖన్నా, నర్గిస్ ఫఖ్రీ, కరణ్ సింగ్ గ్రోవర్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఇటువంటి వాటిలో మోసపోయారు.

చదవండి: బిజీ అవుతున్న ప్రియమణి.. మరో లక్కీ ఛాన్స్‌

మరిన్ని వార్తలు