Sukesh Chandrashekhar: ఆమెను తప్పుపట్టొద్దు.. సుకేష్​ చంద్రశేఖర్​ ఆసక్తికర లేఖ

4 Feb, 2022 09:11 IST|Sakshi

బాలీవుడ్​ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం సుకేష్​ చంద్రశేఖర్​తో రిలేషన్​లో ఉండటమే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్​ కేసులో సుకేష్‌ చంద్రశేఖర్‌ విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో జాక్వెలిన్​కు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్​ కావడంతో ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ రిక్వెస్ట్​ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్​కు మద్దతుగా నిలిచాడు సుకేష్​ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్​తో ఓ ప్రకటన విడుదల చేశాడు.

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఫొటోల గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, ఆమెను చెడుగా చిత్రీకరించవద్దని కోరాడు. 'ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. అలా ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్​షిప్​లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్​ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు.​ ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్​కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.' అని సుకేష్​ చంద్రశేఖర్​ తెలిపాడు. 
 

మరిన్ని వార్తలు