ఏడేళ్లు సహజీవనం.. ఎట్టకేలకు పెళ్లి..

15 Feb, 2021 19:57 IST|Sakshi

‘బహు హమారి రజిని-కాంత్‌’ సీరియల్ నటి తన్వీ తక్కర్‌, ఆదిత్య కాపాడియాల వివాహం ఎప్పుడేప్పుడాని ఎదురు చూస్తున్న అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 2013లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ముంబైలోని ఓ స్టార్‌లో హోటల్‌లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రేపు(ఫిబ్రవరి 16న) పెళ్లి చేసుకోనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న బంధువులకు, సన్నిహితులకు వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారి సన్నిహితల వర్గాలు తెలిపాయి. కాగా ‘ఎక్‌ దూస్రే సే ఖర్తే హే ప్యార్‌ హమ్‌’ సీరియల్లోతో మొదటి సారిగా కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రమలో పడ్డారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఇరూ కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంలో 2013 డిసెంబర్‌ 24న నిశ్చితార్థం చేసుకున్నారు.

దాదాపు ఏడేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట గతేడాది సెప్టెంబర్‌లో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం(ఫిబ్రవరి 16న) వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తన్వీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో కేవలం కొద్ది మంది బంధుమిత్రులు సమక్షంలో నిరాడంబరంగా మా పెళ్లి జరగనుంది. ఎలాంటి హడావుడి చేయకుండా తక్కువ ఖర్చుతో నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం. దీనికి మహమ్మారి కూడా సహకరించింది. ఎందుకంటే పెళ్లికి పెట్టే ఆ ఖర్చును ఈ విధంగా సేవ్‌ చేసుకుని పెద్ద ఇంటి కోసం ఖర్చు పెట్టోచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన కాబోయే భర్త గురించి చెబుతూ.. ‘ఆదిత్య చాలా తెలివైన వాడు. అంతేకాదు మంచి వ్యక్తి కూడా. అతను త్వరగా కలిసిపోతాడు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తొందరగా అర్థం చేసుకుంటాడు. నేనేప్పుడు ఇలాంటి వ్యక్తినే కోరుకున్నాను. నిజంగా ఆదిత్య లాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తన్వీ చివరిగా ‘బెపన్హా ప్యార్‌’ సీరియల్‌ కనిపించింది. ‘మిల్నే జబ్‌ హమ్‌ తుమ్‌’ సిరీయల్‌తో కేరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ‘సాస్‌ బినా ససురాల్’‌, ‘పవిత్ర రిషిత’, ‘మధుబాల’, ‘ఎక్‌ ఇష్క్‌ ఏక్‌ జూన్’‌, ‘బహు హమరీ రజిని-కాంత్‌’ వంటి సీరియల్స్‌లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆదిత్య ప్రముఖ టీవీ షో ‘శఖలక భూమ్‌ భూమ్‌’ తో గుర్తింపు పొందాడు. 

A post shared by Taanvi Thakker (@tanvithakker)

(చదవండి: అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!
              (ప్రియుడితో నటి రెండో పెళ్లి..ఫోటోలు వైరల్‌)
              (విజయ్‌తో సారా అలీఖాన్‌ సెల్ఫీ.. ఫొటో వైరల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు