ప్రముఖ క్యాలెండర్‌ షూట్‌లో విజయ్‌ దేవరకొండ

24 Feb, 2021 20:45 IST|Sakshi

ముంబై : టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 'లైగర్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విజయ్‌..ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌ షూట్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు. ప్రతీ ఏడాది ప్రముఖ స్టార్‌ హీరో, హీరోయిన్లతో డబూ రత్నాని కాలెండర్‌ షూట్‌ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్యరాయ్‌, కియారా అద్వానీ, షారుఖ్‌ ఖాన్‌, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ , అభిషేక్ బచ్చన్ వంటి పాపులర్‌ స్టార్స్‌ డబూ రత్నాని ఫోటోలకు ఫోజులివ్వగా, ఈ ఏడాది 2021 కాలెండర్‌ షూట్‌లో విజయ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపించనున్నారు.


ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్‌ పూర్తి చేసినట్లు డబూ రత్నాని తెలిపారు. ప్రస్తుతం విజయ్..‌ మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్‌’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందులో విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్‌ దేవరకొండ నటించనున్నారు. 

చదవండి 
(ఫ్యాన్‌ మూమెంట్‌: విజయ్‌తో సారా సెల్పీ)
(బాలీవుడ్‌ హీరోయిన్లతో విజయ్‌ దేవరకొండ పార్టీ!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు