– సాక్షిప్రతినిధి, వరంగల్‌/సాక్షి, వరంగల్‌/ భూపాలపల్లి/కేసముద్రం/ మంగపేట/కాజీపేట

24 Mar, 2023 05:56 IST|Sakshi

గాలివాన బీభత్సం

ఎగిరిపోయిన రేకులు, కూలిన వృక్షాలు, విరిగిన స్తంభాలు

తడిసి ముద్దయిన బియ్యం, వస్తువులు

మంగపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో గాలివాన గురువారం బీభత్సం సృష్టించింది. భారీ గాలుల దాటికి మండలంలోని శనిగకుంటలో అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రేకుల షెడ్లు కూలిపోయాయి. సుమారు ఐదు షెడ్లపై వేసిన రేకులు పూర్తిగా లేచిపోయాయి. దీంతో బాధితుల ఇళ్లల్లో ఉన్న బియ్యం, బట్టలు, గృహోపకర వస్తువులు, సామగ్రి తడిసి ముద్దయ్యాయి. వాగొడ్డుగూడెంలో సుమారు ఆరు ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. పలు ఇళ్లపై సిమెంటు రేకులు లేచిపడటంతో ధ్వంసమయ్యాయి. దోమెడలో భారీ వృక్షం రోడ్డుపై పడింది. కరంటు స్తంభాలు విరగడంతో గ్రామంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇళ్లపై రేకులు లేచిపోయి సామాన్లు పూర్తిగా తడిసిపోయాయి. శనిగకుంటలో ఆనాడు కార్చిచ్చు కారణంగా సుమారు 40మంది ఆదివాసీ గిరిజనుల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో ఆయా కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. ప్రస్తుత అకాల వర్షాలు ఆరు బాధిత కుటుంబాలను నష్టాలపాలు చేశాయి. డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించే విధంగా కృషిచేస్తామని లేనిపక్షంలో పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందిస్తామని ఇచ్చిన హామీలను మర్చిపోయారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చే విధంగా చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు.

డానియెల్‌ కేసులో

‘సాక్షి’ తనదైన ముద్ర

వరంగల్‌ నగరం నడిబొడ్డున మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో నివసించే సంచార జాతులకు చెందిన ఆర్య, ఐశ్వర్యల రెండేళ్లు కుమారుడు మిస్సింగ్‌పై సాక్షి 2021, అక్టోబర్‌ 20న ‘డానిఝెల్‌ ఎక్కడ’ అంటూ ఇచ్చిన కథనం పోలీసుల్లో కదలిక తెచ్చింది. అప్పటి వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షించి.. ఆ పిల్లాడి జాడ కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇలా హైదరాబాద్‌లో డానిఝెల్‌ను అక్టోబర్‌ 24న ఎట్టకేలకు కనిపెట్టి తల్లిదండ్రులు ఆర్య, ఐశ్వర్యలకు అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్‌ జోషి ప్రత్యేకంగా సాక్షికి ఫోన్‌ కాల్‌ చేసి బాబు దొరికాడని చెప్పారు. ఇంకోవైపు డానిఝెల్‌ తండ్రి ఆర్య సాక్షికి ఫోన్‌ కాల్‌ చేసి మా బాబు డానిఝెల్‌ దొరకడంలో మీ పత్రిక పాత్ర మరువలేనిదని, ఈరోజు మీ వల్లనే మా డానిఝెల్‌ దొరికాడని కృతజ్ఞతలు తెలిపారు.

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌ గ్రామం. ఈ గ్రామం వరంగల్‌–హైదరాబాద్‌ హైవేలో ఉంటుంది. ఇక్కడ భూముల ధరలు కోట్లల్లో ఉన్నాయి. దీంతో అక్కడ ఒక అమాయక కుటుంబానికి సంబంధించి విలువైన స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. భూమికి సంబంధించి పూర్వాపరాలు సేకరించారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవని తెలుసుకున్న కబ్జాదారులు ఆ భూమిపై కన్నేశారు. కబ్జాకు చక్రం తిప్పగా ఓ తహసీల్దార్‌ సహకరించారు. ఈ వైనంపై కథనం రాయడంతో గుట్టురట్టయ్యింది. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ విచారణకు ఆదేశించారు.

పేదలు, అణగారిన వర్గాలకు ‘సాక్షి’ గొంతుకై ంది. ఉమ్మడి వరంగల్‌లో ‘సాక్షి’ స్వరం పొలికేకై , మూగవోయిన గొంతులకు స్వరాన్ని, గుండె ధైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్నిచ్చింది. వ్యవస్థల్ని చెరబట్టిన వారు దుర్బుద్ధితో దాపెట్టిన నాణెపు రెండో పార్శ్వాన్ని ఆవిష్కరించింది. నిజాన్ని నిజంలా చెబుతామని సంకల్పం తీసుకొని నేటికి సరిగ్గా పదిహేనేళ్లయ్యింది. ఈ ప్రస్థానంలో ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కార వేదికై ంది. అధికార యంత్రాంగాన్ని కదిలించింది. అక్రమార్కుల భరతం పట్టింది. ఎందరో ఆపన్నులకు అండగా నిలిచింది.

భూపాలపల్లి మున్సిపాలిటీలో నత్తనడకన జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్య, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 2022 మే నెలలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన అదనపు కలెక్టర్‌ పలుమార్లు మున్సిపల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి మందలించారు. అభివృద్ధి పనుల నివేదికను అందజేయాలని ఆదేశించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు శాఖలో కొందరు అధికారుల భూదందాలు, సెటిల్‌మెంట్లపై ‘సాక్షి’ బాధితుల ఫిర్యాదులు, ఇన్వెస్టిగేషన్‌ కథనాలు రాసింది. రెండున్నరేళ్ల కాలంలో ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయడంతోపాటు ఓ డీసీపీ, ఓ ఏసీపీ, ఏడుగురు సీఐలు, ఎస్‌ఐలపై బదిలీ వేటు వేసింది.

ప్రజల సమస్యలపై అక్షరాయుధమై..

అధికార యంత్రాంగాన్ని కదిలించి.. అక్రమార్కుల భరతం పట్టించి..

15 ఏళ్ల ప్రస్థానంలో అనుక్షణం ప్రజల పక్షమై..

ఆపన్నులకు అండగా నిలిచి.. ఆత్మ నిబ్బరం ఇచ్చిన వైనం

మరిన్ని వార్తలు