పోలీస్‌శాఖ పనితీరు పర్యవేక్షకుడిగా అంజన్‌ చక్రబోర్తి | Sakshi
Sakshi News home page

పోలీస్‌శాఖ పనితీరు పర్యవేక్షకుడిగా అంజన్‌ చక్రబోర్తి

Published Fri, Nov 10 2023 5:06 AM

చక్రబోర్తికి  మొక్క ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఎస్పీ  - Sakshi

ములుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలీస్‌శాఖ పనితీరు పర్యవేక్షించడానికి భారత ఎన్నికల సంఘం జిల్లాకు 2006 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అంజన్‌ చక్రబోర్తిని నియమించింది. ఈ మేరకు ఆయన గురువారం జిల్లా కేంద్రానికి రాగా ఎస్పీ గాష్‌ ఆలం ఆయనకు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అంజన్‌ చక్రబోర్తి వెస్ట్‌ బెంగాల్‌ కేడర్‌లో ఏసీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలక్షన్‌ ప్రక్రియ ముగిసేంత వరకు జిల్లాలోనే ఉండి చెక్‌పోస్టులు వాటి పనితీరు, ఎన్నికల్లో పోలీస్‌శాఖ పనితీరును పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా చక్రబోర్తి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరిగినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవకతవకలకు పాల్పడినట్లు నిరూపణ అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్‌, సీఐ కిరణ్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ సతీష్‌, ఆర్‌ఐ హోంగార్డ్స్‌ వెంకటనారాయణ, ఎస్సై తాజుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement