ఏ–ఫారం, బీ–ఫారం అంటే? | Sakshi
Sakshi News home page

ఏ–ఫారం, బీ–ఫారం అంటే?

Published Wed, Oct 18 2023 1:54 AM

-

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ఎన్నికల సమయంలో తరచూ ఏ–ఫారం, బీ–ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే వీటి అవసరం ఉంటుంది. అవేమిటో?.. ఎలా ఇస్తారో? తెలుసుకుందాం.

ఏ–ఫారం అంటే...

పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బీ–ఫారం అందజేస్తారు. బీ–ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ‘ఏ’ ఫారం. పార్టీ ఎవరిని ఎంపిక చేసి ఏ–ఫారం అందిస్తుందో వారికి మాత్రమే బీ–ఫారం అందిస్తారు. ఏ–ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ఎన్నికల అధికారులకు అందజేస్తారు.

బీ–ఫారం అంటే...

గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీ లు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని గుర్తించేలా ఇచ్చేదే బీ– ఫారం. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియామకమైన ప్రతినిధులు ఈ బీ–ఫారం అందిస్తారు. నామినేషన్‌ వేసే సమయంలో ఎన్ని కల అధికారులకు ఈ ఫారం దాఖలు చేస్తేనే సదరు అభ్యర్థికి పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తు కేటాయిస్తారు.

Advertisement
Advertisement