Himachal Pradesh: డీ అడిక్షన్ సెంటర్ నుంచి 13 మంది యువతులు పరార్‌..

11 Dec, 2023 12:38 IST|Sakshi

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. అనంతరం బాలికలను అడవిలో గుర్తించి, రక్షించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం పర్వానూలోని ఖాదిన్ గ్రామంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మొత్తం 17 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. శనివారం 13 మంది బాలికలు సెంటర్‌లోని కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, బయటపడి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ యువతులను వెదికిపట్టుకుని తిరిగి సెంటర్‌కు తరలించారు. 

ఈ ఘటన డీ అడిక్షన్ సెంటర్ల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సెంటర్‌లో పంజాబ్ హర్యానాలకు చెందిన యువతులు చికిత్స పొందుతున్నారు. పంజాబ్‌లో డీ-అడిక్షన్ సెంటర్లపై నిషేధం విధించిన తర్వాత మత్తుమందు బాధితులు చికిత్స కోసం హర్యానా, హిమాచల్‌లకు వస్తున్నారు. అయితే హిమాచల్‌లో డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించినప్పటి నుండి ఈ సెంటర్లలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. 

కాగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల నుంచి పారిపోయిన యువతులు.. పోలీసుల విచారణలో తమకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అందుకే పారిపోయామని ఫిర్యాలు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక ఎస్పీ సోలన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా!

>
మరిన్ని వార్తలు